చెరుకుపల్లిలో రోడ్డు ప్రమాదం.. ఇద్దరు యువకులకు గాయాలు

700చూసినవారు
చెరుకుపల్లి జాతీయ రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. రాంగ్‌రూట్‌లో వచ్చిన వాహనం బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం కారణంగా కొంతసేపు హైవేపై ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. సమాచారం అందుకున్న ఎస్ఐ కృష్ణ తిరుపతిరావు సంఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు. అనంతరం ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు.