ఘనంగా ప్రారంభమైన విజ్ఞాన్స్ మహోత్సవ్ 2 కే26

1432చూసినవారు
ఘనంగా ప్రారంభమైన విజ్ఞాన్స్ మహోత్సవ్ 2 కే26
ప్రతి విద్యార్థిలోనూ పుట్టుకతోనే ఏదో ఒక కళా నైపుణ్యం ఉంటుందని, దానిని గుర్తించి ప్రోత్సహించాలని ప్లేబ్యాక్‌ సింగర్, కంపోజర్, లిటిల్‌ మ్యూజిషియన్స్‌ అకాడమీ వ్యవస్థాపకుడు డాక్టర్‌ కొమండూరి రామాచారి కోరారు. గురువారం చేబ్రోలు మండలం వడ్లమూడి విజ్ఞాన్స్‌ యూనివర్సిటీలో జాతీయ స్థాయిలో నిర్వహిస్తున్న ‘‘విజ్ఞాన్‌ మహోత్సవం’’ ప్రారంభమైంది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన డాక్టర్‌ రామాచారి, విద్యార్థి పరిపూర్ణతకు మూడు సూత్రాలు ముఖ్యమని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్