పల్నాడులో కారు ప్రమాదం.. ఏడుగురికి గాయాలు

1230చూసినవారు
పల్నాడులో కారు ప్రమాదం.. ఏడుగురికి గాయాలు
పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం పసుమర్రు సమీపంలో ఆదివారం కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనున్న కాలువలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో చీరాల బీచ్‌ నుంచి నల్గొండ జిల్లా త్రిపురారం వైపు వెళ్తున్న ఏడుగురు యువకులు గాయపడ్డారు. క్షతగాత్రులను స్థానికులు, పోలీసులు గుంటూరులోని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. గాయపడిన వారిలో ప్రదీప్ అనే యువకుడి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు ఘటనపై వివరాలు సేకరిస్తున్నారు.

సంబంధిత పోస్ట్