చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు శనివారం అసెంబ్లీలో మాట్లాడుతూ, సూపర్ సిక్స్-సూపర్ హిట్ అవడంతో వైసీపీ నిద్రలేని రాత్రులు అనుభవిస్తుందని అన్నారు. రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం చంద్రబాబు కాలంతో పోటీపడుతూ లక్ష్యాలను నిర్దేశించుకుని ముందుకు సాగుతున్నారని, ప్రజల అంచనాలకు మించి కూటమి ప్రభుత్వం అభివృద్ధి, సంక్షేమమనే జోడు గుర్రాలపై సవారి చేస్తుందని తెలిపారు.