గురువారం, చిలకలూరిపేట మండలం, పురుషోత్తపట్నంలోని మదర్సా ఉర్దూ అరబిక్ స్కూల్లో పుస్తకాల పంపిణీ, దువా కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు విద్యార్థులకు పుస్తకాలను అందజేస్తూ, విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మైనార్టీ నేతలు ఖాజా హుస్సేన్, జానీ బాషా, సుభాని, మౌలాలి, ఇతర కూటమి నాయకులు పాల్గొన్నారు.