చిలకలూరిపేట: విద్యుత్తు స్తంభంపై మంటలు

0చూసినవారు
చిలకలూరిపేట: విద్యుత్తు స్తంభంపై మంటలు
చిలకలూరి పేట పట్టణం చౌత్రా సెంటర్లో వీరాంజనేయస్వామి ఆలయం వద్ద ఉన్న విద్యుత్తు స్తంభాలకు ఏర్పాటు చేసిన హైమాస్ట్ లైట్లకు శనివారం సాయంత్రం ఒక్కసా రిగా మంటలు వ్యాపించాయి. అరగంట సేపు మంటలు తగ్గకపోవడంతో చుట్టుపక్కల దుకాణదారులు, అటుగా వెళ్లే వాహనదారులు, పాదచారులు ఆందోళన చెందారు. కొద్దిసేపటికి విద్యుత్తు సరఫరా నిలిచి మంటలు ఆగిపో వడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్