చిలకలూరిపేట: సీసీ రోడ్లు, డ్రైనేజ్ ల నిర్మాణానికి శంకుస్థాపన

1200చూసినవారు
చిలకలూరిపేట: సీసీ రోడ్లు, డ్రైనేజ్ ల నిర్మాణానికి శంకుస్థాపన
చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంలో రూ.14 లక్షల వ్యయంతో నిర్మించనున్న సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ నిర్మాణాలకు మాజీ మంత్రి, శాసనసభ్యులు ప్రత్తిపాటి శంకుస్థాపన చేశారు. బుధవారం గ్రామస్తులతో కలిసి ఆయన కొత్తగా రోడ్లు వేయాల్సిన బజార్లను పరిశీలించారు. వర్షపు నీరు, ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు సాఫీగా వెళ్ళిపోయేలా, నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా రోడ్లు వేయాలని ఆయన గ్రామ నాయకులకు, పంచాయతీ సిబ్బందికి సూచించారు.

సంబంధిత పోస్ట్