గురువారం చిలకలూరిపేట (మం) కావూరు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో పిచ్చయ్య, మరియమ్మ అనే భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వారు టూ వీలర్పై చిలకలూరిపేట వస్తుండగా ఆటో ఢీకొట్టిందని స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న 108 వాహనం ఈఎంటి శోభన్ బాబు వారికి ప్రథమ చికిత్స చేసి, ప్రభుత్వ వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం గుంటూరుకు తరలించారు.