‘వన్ మంత్–వన్ కాన్స్టిట్యుయెన్సీ–ఫోర్ విజిట్స్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్‌లో ప్రజల నుంచి 180కిపైగా వినతులు అందాయి. రీ-సర్వే, దేవాదాయ భూముల వివాదాలు, దివ్యాంగుల పెన్షన్లకు సంబంధించిన ఫిర్యాదులు అధికంగా నమోదయ్యాయి. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు జిల్లా అధికారులు అర్జీలను పరిశీలించి, ప్రత్యేక బృందాల ద్వారా సమస్యలను త్వరితగతిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.