పల్నాడు జిల్లాలోని కొండవీడులో ఉత్సవాల సందడి ప్రారంభమైంది. గురువారం, ఉత్సవాల కర్టెన్ రైజింగ్ కార్యక్రమంలో భాగంగా పట్టణంలో 2కే రన్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు, కలెక్టర్ కృతిక శుక్లా పాల్గొన్నారు. రైతుబజార్ నుంచి ఎన్నార్టీ సెంటర్ వరకు జరిగిన ఈ పరుగులో విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. కొండవీడు చారిత్రక వైభవాన్ని చాటిచెప్పేలా ఈ ఉత్సవాలను నిర్వహిస్తున్నారు.