చిలకలూరిపేటలోని
ఎన్టీఆర్ కాలనీ వద్ద సోమవారం పెను ప్రమాదం తృటిలో తప్పింది. పాఠశాల ముగిసిన సమయంలో ఒక్కసారిగా రోడ్డుపైకి వచ్చిన విద్యార్థులను తప్పించేందుకు ఆక్సిజన్, హైడ్రోజన్ సిలిండర్లతో వెళ్తున్న ఆటో డ్రైవర్ వాహనాన్ని పక్కకు మళ్లించడంతో అది అదుపుతప్పి బోల్తా పడింది. అదృష్టవశాత్తూ సిలిండర్లు పేలకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. స్థానికులు వెంటనే స్పందించి ఆటోలో చిక్కుకున్న డ్రైవర్‌ను సురక్షితంగా బయటకు తీశారు. స్కూల్ విడిది సమయంలో విద్యార్థుల భద్రత కోసం తగిన సిబ్బందిని ఏర్పాటు చేయలేదని స్థానికులు పాఠశాల యాజమాన్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.