వైసీపీ ర్యాలీలో డ్రోన్ కలకలం

773చూసినవారు
చిలకలూరిపేటలో వైసీపీ ఆధ్వర్యంలో శుక్రవారం నిర్వహించిన 'చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు' నిరసన ర్యాలీలో డ్రోన్ కెమెరా స్వల్ప కలకలం రేపింది. ర్యాలీ దృశ్యాలను చిత్రీకరిస్తుండగా డ్రోన్ విద్యుత్ వైర్లకు చిక్కుకుని కొద్దిసేపు గిరగిరా తిరిగింది. దీంతో అక్కడున్న కార్యకర్తలు, ప్రజలు ఆందోళనకు గురయ్యారు. అనంతరం డ్రోన్ కిందపడిపోవడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనలో ఎలాంటి గాయాలు జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.

సంబంధిత పోస్ట్