ఎడ్లపాడు: కోడి పిల్లలను మింగిన కొండచిలువ

5చూసినవారు
ఎడ్లపాడు: కోడి పిల్లలను మింగిన కొండచిలువ
శుక్రవారం రాత్రి ఎడ్లపాడు జనవాసాల్లో కొండచిలువ కలకలం సృష్టించింది. గ్రామానికి చెందిన ప్రసాద్ తన పశువుల కొట్టంలోని కోళ్ల గూడు వద్దకు వెళ్ళినప్పుడు, ఒక కొండచిలువ ఒక కోడి, నాలుగు కోడి పిల్లలను చుట్టుకుని చంపి, మింగేయడం గమనించాడు. వెంటనే అప్రమత్తమైన కోళ్ల యజమాని ప్రసాద్, ఆ కొండచిలువను సంహరించి పక్కన పడవేశారు. ఈ సంఘటనతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

సంబంధిత పోస్ట్