లింగారావుపాలెంలో రైతులకు భూమి ఆరోగ్యం, భూసారం అవగాహన..

105చూసినవారు
లింగారావుపాలెంలో రైతులకు భూమి ఆరోగ్యం, భూసారం అవగాహన..
శుక్రవారం ఎడ్లపాడు మండలం లింగారావుపాలెం గ్రామ కేంద్రంలో రైతులకు భూమి ఆరోగ్యం, భూసారంపై అవగాహన కార్యక్రమం జరిగింది. జిల్లా శిక్షణ కేంద్రం వ్యవసాయ అధికారి యం. అరుణ మాట్లాడుతూ, సేంద్రీయ పద్ధతుల్లో భూసారాన్ని పెంచుకోవాలని, పచ్చి రొట్ట పైర్లు, పంట అవశేషాలను కాల్చకుండా కుళ్ళబెట్టాలని సూచించారు. జీవ ఎరువుల వాడకంతో రసాయన ఎరువుల వాడకం 20 శాతం తగ్గుతుందని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్