చిలకలూరిపేటలో ఐమాక్స్ లైట్ల వద్ద మంటలు.. స్థానికుల్లో ఆందోళన

1386చూసినవారు
చిలకలూరిపేట చౌత్రా సెంటర్‌లోని ఆంజనేయస్వామి ఆలయం సమీపంలో శనివారం ఐమాక్స్ లైట్ల వద్ద అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ఘటనతో స్థానిక దుకాణదారులు, ప్రజలు భయాందోళనకు గురయ్యారు. సుమారు అరగంట పాటు మంటలు కనిపించాయని స్థానికులు తెలిపారు. పెద్ద ప్రమాదం జరగనప్పటికీ, విద్యుత్ పరికరాల భద్రతపై అధికారులు దృష్టి సారించి, ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్