చిలకలూరిపేట మండలం దండమూడి గ్రామంలో మహాత్మా గాంధీ ఉపాధి హామీ పథకం (ఎన్‌ఆర్‌ఈజీఏ) కింద జరుగుతున్న పనులను డైరెక్టర్ షన్ముఖ్ కుమార్, ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎం. సిద్ధలింగ మూర్తి, ఏపీడీ ఇ. బూషిరేడ్డి గురువారం ఉదయం 8 గంటలకు సందర్శించారు. పని ప్రదేశంలో ఉపాధి కార్మికుల హాజరును పరిశీలించి, ఎన్‌ఆర్‌ఈజీఏ యాప్ (ఎన్‌ఎమ్‌ఎమ్‌ఎస్) ద్వారా హాజరు నమోదులో ఎదురవుతున్న సమస్యలను స్వయంగా పరిశీలించి, పరిష్కారాల కోసం సూచనలు చేశారు.