
కొలంబియా అధ్యక్షుడి వీసా రద్దు చేసిన అమెరికా
న్యూయార్క్ నగరంలో అమెరికా దళాలను రెచ్చగొట్టారనే ఆరోపణలపై కొలంబియా అధ్యక్షుడు గుస్తావో పెట్రో వీసాను రద్దు చేస్తున్నట్లు అమెరికా విదేశాంగ శాఖ ప్రకటించింది. ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ కోసం న్యూయార్క్లో ఉన్న పెట్రో, ట్రంప్ పరిపాలనను విమర్శిస్తూ, కరేబియన్లో మాదకద్రవ్యాల అక్రమ రవాణా పడవలపై ఇటీవల అమెరికా జరిపిన దాడులపై క్రిమినల్ దర్యాప్తుకు పిలుపునిచ్చారు. ఈ దాడుల్లో కొందరు కొలంబియన్లు మరణించారని పెట్రో అనుమానం వ్యక్తం చేశారు.




