రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి

105చూసినవారు
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వ్యక్తి మృతి
చిలకలూరిపేట సమీపంలో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన 70 ఏళ్ల కోటయ్య సోమవారం రాత్రి మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే 108 సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

సంబంధిత పోస్ట్