బుల్లెట్ ఎక్కిన పల్నాడు కలెక్టర్

773చూసినవారు
బుల్లెట్ ఎక్కిన పల్నాడు కలెక్టర్
ఫిబ్రవరి 7, 8 తేదీలలో కొండవీడు ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ కృతికా శుక్లా తెలిపారు. గురువారం చిలకలూరిపేటలో ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుతో కలిసి కర్టెన్ రైజర్ కార్యక్రమంలో పాల్గొన్న ఆమె, ఉత్సవాలలో హెలీ రైడ్, ట్రెక్కింగ్, బోటింగ్, హార్స్ రన్నింగ్ వంటి కార్యక్రమాలు ఉంటాయని, అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా నిర్వహిస్తామని వెల్లడించారు. అనంతరం బుల్లెట్ ఎక్కి విద్యార్థులను ఉత్సాహపరిచారు.

సంబంధిత పోస్ట్