పల్నాడు: నేను బహిరంగ చర్చకు సిద్దం.. మాజీ ఎమ్మెల్యే కాసు

703చూసినవారు
పల్నాడు జిల్లా అభివృద్ధిలో కాసు కుటుంబం చేసిన పాత్రపై బహిరంగ వేదికలో చర్చించేందుకు తాను పూర్తిగా సిద్ధమని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి ప్రకటించారు. నరసరావుపేటలో మాట్లాడిన ఆయన, ఎమ్మెల్యే బ్రహ్మారెడ్డిని లెక్కలతో కలిసి డిబేట్‌కు రావాలని సవాల్ చేశారు. మాచర్లలో అయినా, మీడియా ముందైనా చర్చకు దిగుతానని స్పష్టం చేశారు. అదేవిధంగా, అక్రమ కేసులు ఎదుర్కొంటున్న పిన్నెల్లి కుటుంబానికి తమ మద్దతు కొనసాగుతుందని తెలిపారు.