ఫిబ్రవరి 7, 8 తేదీల్లో నిర్వహించనున్న కొండవీడు ఫెస్ట్‌కు పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ బి. కృష్ణారావు తెలిపారు. కోటలోని పార్కింగ్, రాకపోకల మార్గాలు, సాంస్కృతిక వేదికలను ఆయన స్వయంగా పరిశీలించారు. పర్యాటకులు భారీగా తరలివచ్చే అవకాశం ఉన్నందున శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాలని, ట్రాఫిక్ నియంత్రణపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు.