ఆస్తి వివాదం: తల్లిదండ్రుల ఇంటికి నిప్పు పెట్టిన కూతురు

965చూసినవారు
చిలకలూరిపేటలోని గుర్రాల చావిడిలో మంగళవారం ఆస్తి గొడవల కారణంగా ఓ వివాహిత తన తల్లిదండ్రుల ఇంటికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టింది. ఈ ఘటనలో ఫర్నిచర్ సహా ఇంట్లోని వస్తువులు కాలిపోయాయి. సకాలంలో కుటుంబ సభ్యులు బయటకు రావడంతో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

సంబంధిత పోస్ట్