ఎడ్లపాడు పోలీసుల తీరుపై విడదల రజిని అసహనం

821చూసినవారు
ఎడ్లపాడు పోలీసుల తీరుపై విడదల రజిని అసహనం
ఎడ్లపాడు పోలీసులు తమపై అక్రమ కేసులు బనాయించారని మాజీ మంత్రి విడదల రజిని బుధవారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడుతూ ధ్వజమెత్తారు. గతనెల 30న స్వామివారిని దర్శించుకున్న తమపై దాడి జరిగినా, ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బాధితులైన తమపైనే తిరుగు కేసులు పెట్టడం అన్యాయమని, పోలీసుల తీరు పక్షపాతంగా ఉందని ఆమె మండిపడ్డారు.

సంబంధిత పోస్ట్