చిలకలూరిపేట మండలం కట్టుబడివారిపాలెంలో కరివేపాకు ప్రాసెసింగ్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయడానికి పీఎంఎఫ్‌ఎంఈ పథకం కింద ఎస్‌బీఐ ద్వారా రూ. 2.20 కోట్ల రుణం మంజూరైంది. జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు లబ్ధిదారులకు రుణ ధ్రువపత్రాన్ని అందజేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా కరివేపాకు విలువ ఆధారిత ఉత్పత్తులకు ప్రోత్సాహం లభించడంతో పాటు స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అధికారులు తెలిపారు.