ఎన్ ఎం ఎన్ ఎఫ్ పథకంలో మట్టి నమూనాల సేకరణకు శ్రీకారం

221చూసినవారు
ఎన్ ఎం ఎన్ ఎఫ్ పథకంలో మట్టి నమూనాల సేకరణకు శ్రీకారం
నేషనల్ మిషన్ ఆన్ నాచురల్ ఫామింగ్ పథకంలో భాగంగా పల్నాడు జిల్లాలో శనివారం మట్టి నమూనాల సేకరణ ప్రారంభమైంది. జిల్లా వ్యవసాయ అధికారి ఎం. జగ్గారావు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి, రైతు ఫరూక్ పొలంలో నమూనాల సేకరణను పర్యవేక్షించారు. జిల్లాలో 20 వేల మంది రైతుల పొలాల నుంచి మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఎడ్లపాడు మండలంలో 358 నమూనాలు సేకరించనున్నట్లు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్