మోటార్ చోరీకి వచ్చి దొరికిన దొంగలు.. రజక కాలనీలో కలకలం

3124చూసినవారు
చిలకలూరిపేట పట్టణంలోని రజక కాలనీలో ఆదివారం రాత్రి నీటి మోటార్ చోరీకి ప్రయత్నించిన ఇద్దరు అనుమానితులను స్థానికులు చాకచక్యంగా పట్టుకున్నారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వారిని అదుపులోకి తీసుకున్నారు. వరుస చోరీల నేపథ్యంలో రాత్రి వేళల్లో పోలీసు గస్తీని పెంచాలని కాలనీవాసులు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనతో స్థానికులు అప్రమత్తమయ్యారు.

సంబంధిత పోస్ట్