చిలకలూరిపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌గా వేణుబాబు బాధ్యతల స్వీకరణ

992చూసినవారు
చిలకలూరిపేట ఆర్టీసీ డిపో మేనేజర్‌గా వేణుబాబు బాధ్యతల స్వీకరణ
చిలకలూరిపేట ఏపీఎస్‌ఆర్టీసీ డిపో నూతన మేనేజర్‌గా యద్దనపూడి వేణుబాబు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ విధులు నిర్వహించిన మేనేజర్ బదిలీ కావడంతో, భీమవరం నుండి బదిలీపై వచ్చిన వేణుబాబు ఆ బాధ్యతలను చేపట్టారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ, గతంలో కూడా తాను చిలకలూరిపేట డిపోలో పనిచేసిన అనుభవం ఉందని గుర్తుచేసుకున్నారు. స్థానిక ప్రజలకు మెరుగైన, సౌకర్యవంతమైన రవాణా సేవలు అందించడమే తన ప్రథమ ప్రాధాన్యత అని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్