బాపట్ల జిల్లా చీరాల మండలం ఈపురుపాలెంలోని ఐటీఐ కళాశాలలో జరిగిన కమిటీ సమావేశం వాగ్వాదంతో కత్తిపోట్లకు దారితీసింది. ఈ ఘటనలో మాజీ ప్రిన్సిపాల్ అబ్దుల్ సత్తార్, ఆయన కుమారుడు జిలానిపై దాడి ఆరోపణలున్నాయి. కమిటీ సభ్యుడు హుస్సేన్ (60) చికిత్స పొందుతూ మృతి చెందగా, ప్రిన్సిపాల్ శేషయ్య తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.