తెనాలిలో 10 ఏళ్ల బాలుడు అదృశ్యం.. తల్లిదండ్రుల ఆందోళన..!

363చూసినవారు
తెనాలిలో 10 ఏళ్ల బాలుడు అదృశ్యం.. తల్లిదండ్రుల ఆందోళన..!
తెనాలి పట్టణంలోని పాండురంగపేటకు చెందిన 10 ఏళ్ల బూదూరి మనోహర్ గురువారం అదృశ్యమయ్యాడు. ఉదయం ఆడుకోవడానికి వెళ్లి సాయంత్రం వరకు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. తల్లిదండ్రుల ఫిర్యాదుతో త్రీటౌన్ పోలీసులు కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. బాలుడు పసుపు టీషర్ట్, నీలం ప్యాంట్ ధరించినట్లు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్