దక్షిణ కొరియాకు ఏపీ ఐఏఎస్ అధికారుల బృందం

1683చూసినవారు
దక్షిణ కొరియాకు ఏపీ ఐఏఎస్ అధికారుల బృందం
రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నలుగురు ఐఏఎస్ అధికారుల బృందాన్ని జులై 5 నుంచి 11 వరకు దక్షిణ కొరియాలోని సియోల్‌కు పంపిస్తోంది. ఈ బృందం అంతర్జాతీయ రోడ్‌షోలో పాల్గొని, వివిధ పారిశ్రామిక సంస్థలు, పెట్టుబడిదారులతో సమావేశాలు నిర్వహించనుంది. భాస్కర్ కటమనేని, ప్రవీణ్ ఆదిత్య, షణ్మోహన్, శుభమ్ బన్సల్‌లకు ఈ పర్యటనకు అనుమతి మంజూరైంది. నవంబర్‌లో నిర్వహించనున్న పెట్టుబడుల భాగస్వామ్య సదస్సుకు ముందస్తు సన్నాహకంగా ఈ విదేశీ పర్యటన చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్