వైసీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. కులం పేరుతో అవమానించారంటూ ఓ ఎస్సీ మహిళ చేసిన ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదు చేశారు. అంతేకాకుండా విధుల్లో ఉన్న పోలీసు అధికారిని తోసివేశారనే ఆరోపణలతో మరో కేసు కూడా నమోదు చేశారు. పోలీస్ యాక్ట్ 30, 30ఏతో పాటు బీఎన్ఎస్ సెక్షన్లు 223, 132 కింద కేసులు నమోదు చేసినట్లు సమాచారం.