గుంటూరు: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం

481చూసినవారు
గుంటూరు: గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం
గుంటూరు రైల్వేస్టేషన్ పరిసరాల్లో శుక్రవారం సుమారు 50-55 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న కొత్తపేట పోలీసులు, మృతురాలి వివరాల కోసం ఆరా తీసినా ఎలాంటి ఆధారాలు లభించలేదు. మృతదేహాన్ని గుర్తింపు కోసం గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపరిచారు. కుటుంబ సభ్యులు లేదా తెలిసినవారు కొత్తపేట పోలీస్ స్టేషన్‌లో సంప్రదించాలని పోలీసులు కోరుతున్నారు.

సంబంధిత పోస్ట్