హీల్ సంస్థ సేవలు అద్భుతం

168చూసినవారు
హీల్ సంస్థ సేవలు అద్భుతం
గుంటూరు సమీపంలోని హీల్ స్వచ్ఛంద సంస్థను పౌర సంస్థల ప్రతినిధులు సందర్శించి, గత మూడు దశాబ్దాలుగా వేలాది మంది అనాధ, పేద పిల్లలకు విద్య, వైద్య సేవలు అందిస్తున్న సంస్థ పనితీరును ఆదివారం ప్రశంసించారు. హీల్ పేరడైజ్ విలేజ్‌లోని హెల్త్, స్పోర్ట్స్, ఆర్టిఫిషియల్ లింబ్ సెంటర్లను వీక్షించి వివరాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా చేయూత ఫౌండేషన్ తరఫున రూ.35 వేల ఆర్థిక సహాయం అందజేశారు. సంస్థ భవిష్యత్తులో మరింత విస్తరించి హీల్ యూనివర్సిటీగా అభివృద్ధి చెందుతుందని నిర్వాహకులు తెలిపారు.  .

సంబంధిత పోస్ట్