గుంటూరు జిల్లా పరిషత్ కార్యాలయంలో ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జీవిత ప్రస్థానాన్ని ప్రతిబింబించే 'సీబీఎన్ @361 (ది పాలిమ్యాథ్)' పుస్తకాన్ని ఘనంగా ఆవిష్కరించారు. రచయిత శ్రీనివాస ప్రసాద్ రచించిన ఈ పుస్తకంలో చంద్రబాబు నాయకత్వం, పరిపాలనా దక్షత, అభివృద్ధి దృక్పథాన్ని వివరించారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు భాష్యం రామకృష్ణ, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనంద్ బాబు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి జీవితంపై పుస్తకం రచించే అవకాశం రావడం తనకు గర్వకారణమని రచయిత శ్రీనివాస ప్రసాద్ ఆనందం వ్యక్తం చేశారు.