జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ ఆదేశాలు: సమన్వయంతో పనిచేయాలి

184చూసినవారు
జీఎస్టీ వసూళ్లపై కలెక్టర్ ఆదేశాలు: సమన్వయంతో పనిచేయాలి
గుంటూరు జిల్లాలో జీఎస్టీ వసూళ్లను సమర్థవంతంగా నిర్వహించేందుకు అన్ని ప్రభుత్వ శాఖలు వాణిజ్య పన్నుల శాఖతో కలిసి పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఎస్. తమీమ్ అన్సారియా ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో జరిగిన జిల్లా స్థాయి సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడుతూ, జీఎస్టీ చెల్లింపుల్లో అవకతవకలు జరగకుండా పర్యవేక్షించి, నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ ఆదాయానికి నష్టం వాటిల్లకుండా అన్ని శాఖలు సమన్వయంతో పన్నుల వసూలుకు సహకరించాలని కలెక్టర్ స్పష్టం చేశారు. ప్రతి నెలా వసూళ్ల పురోగతిపై సమీక్షా సమావేశాలు నిర్వహిస్తామని తెలిపారు.

సంబంధిత పోస్ట్