తెనాలిలో శనివారం 'దీపం-2' పథకం కింద ఉచిత గ్యాస్ సిలిండర్ల పంపిణీని మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రారంభించారు. 32వ వార్డులో లబ్ధిదారులకు స్వయంగా సిలిండర్లను అందజేశారు. ఈ పథకం జిల్లాలో సుమారు 7 లక్షల మందికి ₹852 రాయితీతో వర్తిస్తుందని, అర్హులైన ప్రతి పేద కుటుంబానికి లబ్ధి చేకూర్చడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక అధికారులు, మున్సిపల్ సిబ్బంది పాల్గొన్నారు.