తుళ్లూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరం

222చూసినవారు
తుళ్లూరులో ఉచిత పశు ఆరోగ్య శిబిరం
తుళ్లూరు పశువైద్యశాలలో శుక్రవారం ఉచిత పశు ఆరోగ్య శిబిరం నిర్వహించనున్నట్లు మందడం పశువైద్యాధికారి కె. నాగేశ్వరరావు తెలిపారు. ఈ శిబిరంలో ఆవులు, గేదెలు, గొర్రెలు, మేకలకు టీకాలు వేయడంతో పాటు నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తారు. పశువుల ఆరోగ్యంపై రైతులు అవగాహన కలిగి ఉండాలని, తుళ్లూరు పరిసర ప్రాంత రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.

సంబంధిత పోస్ట్