గుంటూరు: ప్రకటనల ఏజెన్సీ అనుమతులు రద్దు

331చూసినవారు
గుంటూరు: ప్రకటనల ఏజెన్సీ అనుమతులు రద్దు
చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద హోర్డింగ్ ల ఏర్పాటుకు ప్రకటనల ఏజెన్సీకి ఇచ్చిన అనుమతులను వెంటనే రద్దు చేయాలని కమిషనర్ మయూర్ అశోక్ సిటీప్లానర్ను ఆదేశించారు. వాకింగ్ ట్రాక్లో ప్రకటన బోర్డుల ఏర్పాటుకు సదరు ఏజెన్సీ కాంక్రీట్ పునాదులు ఏర్పాటు చేయడాన్ని స్థానికులు, వాకర్లు గురువారం తీవ్రంగా వ్యతిరేకించి ఆందోళన చేశారు. దీనిపై కమిషనర్ స్పందించి వెంటనే పనులు నిలిపివేయాలని ప్రణాళిక అధికారులను ఆదేశించారు. వాకింగ్ ట్రాక్లో నడకకు వచ్చే వారికి ఇబ్బందుల్లేకుండా నాలుగు ప్రాంతాల్లో హోర్డింగ్స్కు ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని ఆదేశించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్