గుంటూరు జిల్లా నుంచి చైనాకు ఎగుమతి చేసిన మూడు కంటైనర్ల మిర్చిని పురుగుమందుల అవశేషాలు ఉన్నాయంటూ అక్కడి అధికారులు తిరస్కరించి వెనక్కి పంపించారు. గత ఏడాది కూడా ఇదే కారణంతో 60 కంటైనర్ల మిర్చిని చైనా రిజెక్ట్ చేయగా, వాటిని సముద్రంలోనే పారబోసిన విషయం తెలిసిందే. తాజా ఘటనతో మిర్చి రైతులు, వ్యాపారుల్లో ఆందోళన నెలకొంది. ఎగుమతులకు ఆటంకం ఏర్పడితే మార్కెట్‌లో ధరలు భారీగా పడిపోయే ప్రమాదం ఉందని వారు భయపడుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా సేంద్రియ సాగు, నాణ్యత ప్రమాణాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులు సూచిస్తున్నారు.