నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో వివిధ విభాగాల మధ్య సమన్వయం ఉండాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా పనులు నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలని కమిషనర్ మయూర్ అశోక్ ఆదేశించారు. శుక్రవారం లక్ష్మీపురం, కృష్ణనగర్, బృందావన్గార్డెన్స్లోని పలు ప్రాంతాల్లో అభివృద్ధి పనులు, రహదారి విస్తరణ పనులను ఆయన పరిశీలించారు. బృందావన్గార్డెన్స్ ప్రధాన రోడ్డులో విస్తరణ పనులపై అసంపూర్తి సమాచారం ఇచ్చిన ఏఈ, డీఈఈపై అసహనం వ్యక్తం చేశారు. మురుగునీరు రోడ్లపైకి రాకుండా ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలని, అభివృద్ధి పనుల నాణ్యతపై ఫిర్యాదులు వస్తున్నాయని ఆయన తెలిపారు.