గుంటూరు: జీజీహెచ్ అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం

558చూసినవారు
గుంటూరు: జీజీహెచ్ అభివృద్ధికి దాతల సహకారం అభినందనీయం
గుంటూరు ప్రభుత్వ సమగ్రాసుపత్రి అభివృద్ధికి పూర్వ విద్యార్థులు, దాతల సహకారం అభినందనీయమని తూర్పు ఎమ్మెల్యే నసీర్ అన్నారు. జింకానా ఆర్థిక సహాయంతో నిర్మించిన మాతాశిశు సంరక్షణ కేంద్రాన్ని శుక్రవారం ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబునాయుడు వస్తున్నందున ఏర్పాట్లను ఆయన పరిశీలించారు. ట్రాఫిక్, వాహనాల పార్కింగ్ గురించి పోలీసు అధికారులకు సూచనలిచ్చారు. ఎమ్మెల్యే నసీర్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గుంటూరు ప్రభుత్వాస్పత్రికి మహర్దశ తీసుకొచ్చామన్నారు. గత వైకాపా పాలనలో ఆసుపత్రిలో కనీస వసతులు కూడా కల్పించకపోవడంతో రోగులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారని చెప్పారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్