గుంటూరు: బోధనలో ప్రమాణాలు పాటించండి

573చూసినవారు
గుంటూరు: బోధనలో ప్రమాణాలు పాటించండి
నగరంలోని కేఎస్ఆర్ నగర పాలకసంస్థ ఉన్నత పాఠశాల, ప్రాథమిక పాఠశాల, యాదవ ఉన్నత పాఠశాల, నల్లపాడు జడ్పీ ఉన్నత పాఠశాలల్లో డీఈవో సలీంబాషా బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తరగతి గదిలో ప్రతి విద్యార్థిని తీర్చిదిద్దేలా బోధనలో ప్రమాణాలు పాటించాలని, పదోతరగతి వంద రోజుల ప్రణాళికలో భాగంగా ప్రత్యేక తరగతులు పకడ్బందీగా నిర్వహించాలని ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులకు ఆయన సూచనలిచ్చారు. విద్యార్థుల సామర్థ్యాలను ఆయన పరిశీలించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్