గుంటూరు: శాంతిభద్రతకు విఘాతం కలిగించేందుకే

1004చూసినవారు
గుంటూరు: శాంతిభద్రతకు విఘాతం కలిగించేందుకే
గుంటూరు నగర మేయర్ కోవెలమూడి రవీంద్ర మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబుపై అంబటి రాంబాబు చేసిన అసభ్యకర వ్యాఖ్యలు రాష్ట్రంలో శాంతిభద్రతలకు విఘాతం కలిగించేవిగా ఉన్నాయని అన్నారు. ఆయన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని, సభ్యసమాజం తలదించుకునేలా దూషించారని తెలిపారు. కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అడ్డుకోవడానికే ఆ వ్యాఖ్యలు చేశారని, రాజకీయ విమర్శలు పదునైన మాటలతో చేయవచ్చని, కానీ అప్రజాస్వామిక పదజాలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని మేయర్ పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్