గుంటూరు: 'తండాల అభివృద్ధికి ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి

76చూసినవారు
గిరిజనుల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలు అమలు చేయాలని ఆలిండియా బంజారా సేవా సంఘం జాతీయ నాయకులు లక్ష్మానాయక్ సూచించారు. ఆలిండియా బంజారా సేవా సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం ఆదివారం గుంటూరులో జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర కమిటీ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గిరిజన తండాలలో మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

సంబంధిత పోస్ట్