గుంటూరు: ప్రజలకు పలు సూచనలు చేసిన డిఎస్పి

447చూసినవారు
వేసవి తాపానికి ప్రజలు ఆరుబయట, డాబాలపై నిద్రిస్తున్నందున ఇంటి తలుపులు జాగ్రత్తగా మూసుకోవాలని గుంటూరు తూర్పు డీఎస్పీ అబ్దుల్ అజిత్ గురువారం సూచించారు. వేసవి సెలవుల్లో ఊరెళ్లేవారు సమీప పోలీస్ స్టేషన్లలో సమాచారం ఇస్తే సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తామని, విలువైన వస్తువులను బ్యాంకు లాకర్లలో భద్రపరుచుకోవాలని తెలిపారు. ఒంటరి మహిళలు ప్రయాణాల్లో ఒంటిపై బంగారం ధరించవద్దని డీఎస్పీ పేర్కొన్నారు. ప్రతి ఇంటి ముందు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు.

సంబంధిత పోస్ట్