గుంటూరు నగరంలో ప్రధాన లైన్ల మరమ్మతుల కారణంగా బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు విద్యుత్ సరఫరా నిలిచిపోతుందని డీవైఈఈ గురవయ్య మంగళవారం తెలిపారు. గోరంట్ల, అమరావతి మెయిన్ రోడ్డు, విజయదుర్గానగర్, హోసన్నా మందిర్, శ్రీలక్ష్మీనగర్ ప్రాంతాల్లో ఈ అంతరాయం ఉంటుందని, వినియోగదారులు గమనించాలని ఆయన కోరారు.