స్థానిక సమస్యలపై ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు ప్రజాఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం సోమవారం నిర్వహించనున్నట్లు కమిషనర్ మయూర్ అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమం ఉదయం 10.30 గంటల నుంచి ఒంటి గంట వరకు కొనసాగుతుందని, ఈ సమయంలో ప్రజలు నేరుగా తమ అర్జీలను అందజేయవచ్చని ఆయన వెల్లడించారు. ఈ వేదిక ద్వారా ప్రజల సమస్యలకు సత్వర పరిష్కారం లభించే అవకాశం ఉంది.