గుంటూరు నగర ప్రజల స్థానిక సమస్యల పరిష్కారానికి ఈ నెల 2వ తేదీ సోమవారం ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు గుంటూరు నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో "ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక" (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమం నిర్వహించబడుతుందని నగర కమిషనర్ కె. మయూర్ అశోక్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమంలో జిఎంసి విభాగాధిపతులతో కలిసి ప్రజల నుండి నేరుగా అర్జీలు, ఫిర్యాదులు స్వీకరించనున్నారు.