గుంటూరులోని చుట్టుగుంట వాకింగ్ ట్రాక్ వద్ద అనుమతులు లేకుండా పెద్ద పెద్ద హోర్డింగుల కోసం అర్ధరాత్రి పోస్టుల నిర్మాణం చేపట్టడాన్ని వాకర్స్ తీవ్రంగా వ్యతిరేకించారు. ప్రభు డిజిటల్ యాడ్స్, నగర కమిషనర్, జిఎంసి సిటీ ప్లానర్లపై వాకర్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎండోమెంట్ ఈవో మానుకొండ విజయ, కోటేశ్వరరావు ఆధ్వర్యంలో 9 కాంక్రీట్ పోస్టులను తొలగించారు. ఈ సంఘటనతో వాకర్స్ తమ నిరసన తెలిపారు.