గుంటూరు: రాధాకృష్ణపై కఠిన చర్య తీసుకోవాలి

1049చూసినవారు
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డిపై అసత్య ప్రచారం చేశారని ఆరోపిస్తూ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణపై కఠిన చర్యలు తీసుకోవాలని నగర వైసీపీ అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో, బుధవారం గుంటూరులోని శంకర్ విలాస్ సెంటర్‌లో వైసీపీ నేతలు పోలీసులకు చిక్కకుండా రాధాకృష్ణ దిష్టిబొమ్మను దహనం చేశారు. అప్రమత్తమైన పోలీసులు అక్కడికి చేరుకుని దిష్టిబొమ్మను స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనతో గుంటూరులో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

సంబంధిత పోస్ట్